ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీళ్లు ఇచ్చాకే మా గ్రామంలోకి రావాలి.. ఎమ్మెల్యేను అడ్డుకున్న మహిళలు - AP Highlights

Kadiri MLA Siddareddy: రాష్ట్రంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలకు అడగడగునా విమర్శలు, అడ్డగింపులు ఎదురౌతున్నాయి. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డికి అలానే చేదు అనుభవం ఎదురైంది.

Kadiri MLA Siddareddy
Kadiri MLA Siddareddy

By

Published : Jan 8, 2023, 5:38 PM IST

Kadiri MLA Siddareddy: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గాండ్లపెంట మండలం మలమీదపల్లి సచివాలయం పరిధిలోని కోటూరు, కరణంవరిపల్లి, రెడ్డివారిపల్లి, అరమడకవారిపల్లి గ్రామాలలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో శాసన సభ్యుడు సిద్ధారెడ్డి పాల్గొన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించిన తర్వాతనే.. గ్రామంలోకి రావాలంటూ కోటూరులో మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. సర్ది చెప్పేందుకు స్థానిక నాయకులు ప్రయత్నించినా గ్రామస్థులు వినిపించుకోలేదు.

సర్పంచ్​, స్థానిక నాయకులు పట్టించుకోరు.. అధికారుల వినిపించుకోరు.. మా సమస్యలు పరిష్కరించిన తర్వాతే గ్రామంలోకి రావాలంటూ నిలదీయడంతో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details