దారుణం.. వాషింగ్ మిషన్ వృథా నీటి విషయంలో గొడవ.. మహిళను రాళ్లతో కొట్టి.! - Washing Machin Issue in satyasai district
12:10 December 06
వాషింగ్ మిషన్‌లోని వృథా నీటి విషయంలో వివాదం
WOMAN DIED IN SATYASAI DISTRICT : వాషింగ్ మిషన్‌లోని వృథా నీటి విషయంలో.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మశానంపేటలో నివాసముంటున్న పద్మావతమ్మ ఇంటిలో నుంచి వాషింగ్ మిషన్‌కు వినియోగించిన వృథా నీరు.. పక్కింటిలోని వేమన్న నాయక్ ఇంటి ముందుకు వెళ్లింది. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారి తీసింది. వేమన్న నాయక్ కుటుంబ సభ్యులు పద్మావతమ్మ పై బండరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న స్థానికులు పద్మావతిని చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పద్మావతమ్మ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి: