GADAPA GADAPA PROGRAMME: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రొద్దం మండలంలోని శేషాపురం గ్రామంలో మాజీమంత్రి శంకర్ నారాయణను స్థానికులు నిలదీశారు. మొదట శేషాపురం గ్రామంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గడపగడప నిర్వహిస్తుండగా.. గ్రామంలో రోడ్లు నిర్మించలేదని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని పలువురు స్థానికులు అడ్డగించారు. ప్రధాన రహదారి నుంచి గ్రామానికి 300 మీటర్ల రోడ్లు కూడా పూర్తి చేయలేదని పలువురు నాయకులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న ఎస్ఐ నాగస్వామి, పోలీసులు నిరసనకారులతో చర్చించడంతో సమస్య సద్దుమణిగింది.
గడప గడప కార్యక్రమంలో మాజీ మంత్రికి నిరసన సెగ - సత్యసాయి జిల్లాలో శంకర్ కార్యక్రమం
GADAPA GADAPA PROGRAMME: సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి శంకర్ నారాయణని స్థానికులు నిలదీసారు. గడప గడప కార్యక్రమంలో రోడ్డు నిర్మించలేదని స్థానిక ఎమ్మెల్యేను కూడా అడ్డకున్నారు. పోలీసుల చొరవతో సమస్య పరిష్కారం అయింది.
Shankar in Gadapa Gadapa programme