Tree Climbing Cheetahs: కొబ్బరి చెట్టుపైకి ఎక్కిన రెండు చిరుతలు ఘర్షణకు దిగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం కేజీఎన్ పాలెంలో ఈ చిరుతలు సంచరిస్తున్నారు. స్థానిక మొక్కజొన్న పొలంలో ఉన్న కొబ్బరి చెట్టు పైకి ఎక్కిన దృశ్యాలను స్థానిక యువకులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. వీడియోలను చూసిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కొబ్బరి చెట్టెక్కిన రెండు చిరుతలు.. వీడియో వైరల్ - సత్యసాయి జిల్లా వార్తలు
Tree Climbing Cheetahs: రెండు చిరుతలు కొబ్బరి చెట్టుపైకి ఎక్కి చిందులు వేశాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని కేజీఎన్ పాలెం గ్రామంలో ఈ దృశ్యాలు కనిపించాయి. వీటిని కొందకు యువకులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Etv Bharat