ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Varla Ramaiah Letter: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ - ఎన్​హెచ్​ఆర్సీకి వర్ల రామయ్య లేఖ

Varla Ramaiah letter: పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కోసం వెళ్లిన బాధితుడిపై చేయి చేసుకున్న ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ రాశారు. తల్లి పింఛను తొలగించడాన్ని ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు పీఎస్‌లో దాడి ఈ ఘటనపై విచారణ జరిపాలని కోరారు.

Varla Ramaiah
వర్ల రామయ్య లేఖ

By

Published : May 3, 2022, 10:04 AM IST

Varla Ramaiah letter: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ రాశారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు వేణుగోపాల్​పై దాడి చేసిన ఎస్ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. చిలమత్తూరు పీఎస్​లో బాధితుడిపై ఎస్ఐ దాడి చేయడం.. కొంతమంది పోలీసుల దుర్మార్గపు చర్యలకు నిదర్శనమన్నారు. తల్లి పెన్షన్ తొలగించడాన్ని ప్రశ్నించిన కుమారుడు వేణుగోపాల్​తో ఎస్ఐ అసభ్యంగా దుర్భాషలాడుతూ దాడి చేశారని తెలిపారు. బాధితుడిని మరింత బాధించడం అత్యంత దుర్మార్గమని లేఖలో ప్రస్తావించారు. ఎస్ఐ తీరు ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. ఇది ఏపీ పోలీస్ మాన్యువల్‌కు కూడా పూర్తి విరుద్ధమన్నారు. వేణుగోపాల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన ఎస్ఐ రంగడుపై విచారణ జరిపి... తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిన విద్యుదుత్పత్తి.. హుటాహుటిన ప్లాంట్‌కి నిపుణులు

ABOUT THE AUTHOR

...view details