HULCHAL: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఇద్దరు యువకులు హల్‌చల్ సృష్టించారు. బైక్‌పై రోడ్డను క్రాస్ చేస్తూ రాంగ్ రూట్లో వెళ్లిన యువకులు.. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని అడ్డగించారు. వాహనంపై దాడి చేసి.. అందులోని ప్రయాణికులతో ఘర్షణ పడ్డారు. ఎందుకు వాహనాన్ని వేగంగా నడుపుతున్నావంటూ గొడవపడ్డారు. యువకుల హంగామాను గమనించిన స్థానికులు.... వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. వారిపైనా యువకులు వాగ్వాదానికి దిగారు. యువకుల నిర్వాకంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఇద్దరు యువకులను పోలీసులకు పట్టించేందుకు స్థానికులు ప్రయత్నించగా.. అక్కడి నుంచి జారుకున్నారు..
HULCHAL: కదిరిలో యువకులు వీరంగం.. డ్రైవర్‌తో వాగ్వాదం - సత్యసాయి జిల్లా తాజా వార్తలు
HULCHAL: యువకులు బైక్ రైడింగ్‌లతో రెచ్చిపోతున్నారు. రాంగ్ రూట్లో వస్తూ అడ్డొచ్చిన వారిపై దాడికి దిగుతున్నారు. మొన్నటికిమొన్న విశాఖలో బైక్ రేసర్లు సృష్టించిన వీరంగం మర్చిపోకముందే.. తాజాగా మరో ఇద్దరు యువకులు రచ్చ రచ్చ చేశారు. రాంగ్ రూట్లో వస్తూ రోడ్డు క్రాస్ చేస్తున్న యువకులు.. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని అడ్డగించి డ్రైవర్‌తో గొడవ పడ్డారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే??
కదిరిలో యువకులు వీరంగం