Two children died: శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం గుడదహళ్ళిలో విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతిచెందారు. గుడదహళ్లికి చెందిన రాజు అనే వ్యక్తికి హరీష్, భరత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు 8, చిన్న కుమారుడు 5వ తరగతి చదువుతున్నారు. మంగళవారం పశువులను మేతకు తీసుకెళ్లిన చిన్నారులు.. పొలంలో ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందారు. పిల్లలు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా గాలించారు. ఈ ఉదయం కుంట నుంచి మృతదేహాలు బయటికి తేలాయి. విగతజీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు.
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..! - సత్యసాయి జిల్లాలో ఇద్దరు చిన్నారులు మృతి
Two children died: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి చెందారు. అసలేం జరిగిందంటే..?
ఇద్దరు చిన్నారులు మృతి