ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bees attack: దహనసంస్కారాలకు వెళ్తున్నవారిపై తేనెటీగల దాడి.. - శ్రీ సత్యసాయి జిల్లా తాజా వార్తలు

Bees attack: దహనసంస్కారాల కోసం వెళ్తున్న వారిపై తేనెటీగలు దాడిచేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో 21 మంది తేనెటీగల దాడిలో గాయపడ్డారు. అసలేం జరిగిందంటే..?

bees attack
తేనెటీగల దాడి

By

Published : Oct 24, 2022, 1:55 PM IST

Bees attack: అనారోగ్యంతో మృతిచెందిన వ్యక్తి దహనసంస్కారాల కోసం వెళ్తున్న వారిపై తేనెటీగలు దాడిచేసిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం నల్లసింగయ్యగారిపల్లిలో చోటు చేసుకుంది. నల్లసింగయ్యగారిపల్లికి చెందిన కేశవరెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించారు. ఆయన అంతిమయాత్రలో బంధువులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సమయంలో అక్కడ చెట్టుపై ఉన్న తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. తేనెటీగల దాడిలో 21 మంది గాయపడ్డారు. వీరిని నల్లమాడ, కదిరి ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details