Students Health Upset due to Food Poison: సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం మిట్టపల్లి ప్రభుత్వ బాలుర వసతి గృహం విద్యార్థులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో ఉదయం విద్యార్థులకు మెనూ ప్రకారం టిఫిన్‌తో పాటు కేసరి బాత్ వడ్డించారు. అల్పాహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మొత్తం 22 మంది అస్వస్థతకు గురయ్యారు.
అల్పాహారం తిని.. 22 మంది విద్యార్థులకు అస్వస్థత - ఆసుపత్రి
Food Poison: సత్యసాయి జిల్లాలో ప్రభుత్వ బాలుర వసతి గృహం విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు చేసుకోవటంతో వారిని హుటాహూటిన ఆసుపత్రికి తరలించారు.
![అల్పాహారం తిని.. 22 మంది విద్యార్థులకు అస్వస్థత Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16442739-348-16442739-1663841394527.jpg)
పరిస్థితి విషమంగా ఉన్న 17 మందిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మిగిలిన ఐదుగురిని ఓబుల దేవర చెరువు ఆరోగ్య సిబ్బంది వసతి గృహం ఆవరణలోనే చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న కదిరి ఆర్డీవో రాఘవేంద్ర ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్యస్థితిని వైద్యులను కలిసి తెలుసుకున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.
ఇవీ చదవండి: