Interstate Gang of Thieves Arrested: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వీరిని కర్ణాటక ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మొత్తం ఆరుగురు ఉన్న ఈ ముఠాలో.. ప్రస్తుతం నలుగురిని పట్టుకున్నట్టు తెలిపారు. ఇంకా మరో ఇద్దర్ని పట్టుకోవాలని.. వారు కూడా వీళ్ల గ్యాంగేనని చెప్పారు. మరో ఇద్దరు కూడా దొరికితే కేసుల సంఖ్య పెరగచ్చని అన్నారు. ప్రస్తుతం వీరిపై సుమారు పలు పోలీస్ స్టేషన్లలో 29కి పైగా కేసులు నమోదైనట్లు డీఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు. కర్ణాటకలోని పావగడ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. పలు స్టేషన్లలో 29 కేసులు నమోదు - ఏపీ వార్తలు
Interstate Gang of Thieves Arrested: తాళం వేసిన ఇళ్లు, షాపులే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై ఇప్పటికే 29 కేసులు.. పలు స్టేషన్లలో నమోదైనట్లు తెలిపారు. వీరివద్ద నుంచి సుమారు 17 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు.
దొంగతనాలకు పాల్పడుతున్న ఆంజనేయులు, నరేష్, రాఘవయ్య, శేషగిరిలను.. రొద్దం శివారు ప్రాంతంలో అరెస్ట్ చేశామన్నారు వీరి నుంచి సుమారు రూ.17 లక్షల దొంగ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. 320 గ్రాముల బంగారు, 630 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. తాళం వేసిన ఇళ్లు, షాపుల షట్టర్లను పగలగొట్టి వీరు దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక ప్రాంతంలో కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని అన్నారు. పండుగల పూట ఎవరైనా ఇళ్లకు తాళం వేసుకొని బంధువుల ఊళ్లకు వెళుతుంటే.. ఇంట్లో విలువైన సామాగ్రిని బ్యాంకు లాకరులో దాచుకోవాలని సూచించారు. లేదంటే పోలీసులకు అయినా సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఇవీ చదవండి: