ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనుకొండలో దారుణం.. భార్యపై అనుమానంతో కొడుకును చంపిన తండ్రి - సత్యసాయి జిల్లాలో చిన్నారి హత్య

Child Murder: చేయి పట్టి నడిపించాల్సిన కన్న తండ్రి ఆ చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. కన్న కొడుకునే తండ్రి అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగింది. అనుమానం పెనుభూతం అన్నట్లుగా భార్యపై అనుమానంతో కుమారుడు తనకు జన్మించలేదని అపోహతో కన్న తండ్రే కసాయివాడై కుమారున్ని చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి కవిత, కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి.

child
child

By

Published : Dec 28, 2022, 3:45 PM IST

Updated : Dec 28, 2022, 7:25 PM IST

Child Murder: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో భార్యపై అనుమానంతో కుమారుడు తనకు జన్మించలేదనే అపోహతో కన్న తండ్రే కొడుకుని కడతేర్చిన ఘటన జరిగింది. మడకశిర పరిధిలోని శివాపురం గ్రామానికి చెందిన కవితతో రామగిరికి చెందిన గంగరాజుకు 2019లో వివాహం జరిగింది. వివాహమైన రెండు సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. అనంతరం వీరికి ఏడాదిన్నర క్రితం మగబిడ్డ జన్మించాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవల కారణంగా కవిత బాబును తీసుకుని పుట్టింటికి వెళ్లింది.

అయితే నెల రోజుల క్రితం భర్త గంగరాజు కవిత కుటుంబం వద్దకు వెళ్లి.. తనను బాగా చూసుకుంటానని నమ్మబలికి వారి వద్దనే ఉంటూ ఈ నెల 20న ఏడాదిన్నర వయసున్న వికాస్​ను తీసుకెళ్లి హత్య చేశాడు. భార్యపై అనుమానంతో కుమారుడు తనకు జన్మించలేదనే అపోహతో కన్న కుమారుడినే హతమార్చాడు. మడకశిరకు 40 కిలోమీటర్ల దూరంలోని పెనుకొండలోని కొండ వెనుక భాగంలోని అటవీ ప్రాంతంలో ఉలవల గుట్టపై బాలుడు మృతదేహాన్ని పడేశాడు. మరుసటి రోజు గంగరాజు బాలుడు ఇంటికి రాకపోవడంతో కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో తమ కుమారుడు చనిపోయాడని బాధితులు ఆరోపించారు.

అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు బాలుడు చనిపోయినట్లు తెలిపారు. కుమారుడి మృతిని తెలుసుకున్న కవిత రోదనలు కుటుంబ సభ్యులు, బంధువులను కంటతడి పెట్టించాయి. ఇప్పటికైనా పోలీసులు నిందితుడి గంగరాజుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

భార్యపై అనుమానంతో కొడుకును చంపిన తండ్రి

ఇవీ చదవండి:

Last Updated : Dec 28, 2022, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details