బాలసదన్ నుంచి ఆరేళ్ల బాలిక అదృశ్యం.. అక్కడ ప్రత్యక్షమైంది! - Hindupur ICDS Balasadan
16:41 April 23
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని లక్ష్మీపురంలో.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే బాల సదన్ నుంచి ఆరేళ్ల బాలిక అదృశ్యమైన సంఘటన ఎట్టకేలకు సుఖాంతమైంది. శనివారం మధ్యాహ్నం బాలిక అదృశ్యమవడంతో.. అధికారులు, పోలీసులు పలుచోట్ల వెతికారు. రాత్రివరకూ గాలింపు చర్యలు కొనసాగించారు. అయితే.. చివరకు రాత్రి వేళ బంధువుల ఇంట్లో బాలికను గుర్తించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం మధ్యాహ్నం పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థిని భోజనం అనంతరం.. బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే.. బంధువుల ఇంటికి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఊపిరి పీల్చుకున్న అధికారులు.. అక్కడి నుండి బాల సదన్ కు తీసుకు వచ్చినట్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీ కుమారి తెలిపారు.
ఇదీ చదవండి : రాయలసీమ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం