Road accidents: శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా కదిరి మండలంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జయ ప్రవీణ్ సొంత ఊరు నుంచి కారులో బెంగళూరు వెళుతుండగా కదిరి మండలం కె.కుంట్లపల్లి వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయ ప్రవీణ్‌ను స్థానికులు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు.
కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లి వద్ద జరిగిన మరో ప్రమాదంలో అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఐదుగురు గాయపడ్డారు. వీరిలో తీవ్ర ఇద్దరికి గాయాలయ్యాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన నాగలక్ష్మి సాయి గణేష్ దంపతుల మనుమడి తలనీలాలు వేడుక కోసం తిరుపతి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సాయి గణేష్ కుటుంబం ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం ఎరుకల వాండ్లపల్లి టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది. మరో వాహనంలో ప్రయాణిస్తున్న వారి బంధువులు గాయపడినవారిని కదిరి ఆస్పత్రికి తరలించారు. బాధితులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారేనని తెలిపారు. రెండు ఘటనల్లో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Road accidents: సత్యసాయి జిల్లాలో రెండు ప్రమాదాలు... ఒకరు మృతి - శ్రీ సత్య సాయి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు
Road accidents: శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా కదిరి మండలంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కదిరి మండలం కె.కుంట్లపల్లి వద్ద బొలెరో వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఎరుకలవాండ్లపల్లి వద్ద తుఫాన్ వాహనం చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదాలు