Two Mens Died in Road Accident : శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అంతేకాకుండా ఈ ప్రమాదంలో రెండు ఎద్దులు మృతి చెందాయి. ఎరువుల లోడుతో వస్తున్న డీసీఎం వాహనం ఎడ్ల బండిని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. అగళికి చెందిన తిమ్మేగౌడ, గోవిందప్ప అనే ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తి కలిసి.. తెల్లవారుజామున ఇసుక కోసం ఎడ్లబండిలో ఇసుక కోసం బయల్దేరారు. వీరు రోడ్డు పై వెళ్తున్న క్రమంలో ఎరువుల లోడుతో ఉన్న డీసీఎం వాహనం వీరి ఎడ్లబండిని వెనక వైపు నుంచి వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఎడ్లబండి అందులోని వ్యక్తులు రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడిపోయారు.
సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులతో సహా రెండు ఎద్దులు మృతి - Two Mens Died in Road Accident
Accident : శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పొగా.. రెండు ఎద్దులు మరణించాయి. వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఈ ప్రమాదానికి కారణమైంది. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం కూడా బోల్తా పడటంతో.. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఎడ్ల బండిలో ఉన్న ముగ్గురిలో తిమ్మేగౌడ, గోవిందప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎడ్ల బండిని లాగుతున్న ఎద్దులూ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాయి. ఎడ్లబండిని ఢీ కొట్టిన డీసీఎం వాహనం కూడా వేగానికి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీనిలో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు అంటున్నారు. స్థానికులు క్షతగాత్రులను రొళ్ల ఆసుపత్రికి తరలించారు. పొగ మంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఇవీ చదవండి: