ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Raghuveera Reddy: భారత్ జోడో యాత్రలో పాల్గొంటా: రఘువీరారెడ్డి - bharath jodo in ap

Bharat Jodo: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. ఈ నెల 14వ తేదీన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం రాయదుర్గంలో కొనసాగనుంది. ఈ సందర్భంగా మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. యాత్రకు మద్దత్తు తెలుపుతున్నట్లు వెల్లడించాడు. యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.

Raghuveera Reddy
భారత్ జోడోపై రఘువీరారెడ్డి

By

Published : Oct 11, 2022, 10:54 PM IST

Raghuveera Reddy on Bharat Jodo: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 14వ తేదీన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హీరేహళ్ మండలంలో సాగే రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొననున్నట్లు తెలిపారు. నీలకంఠాపురం దేవస్థానాల నుంచి శేష వస్త్రాలు, తీర్థ ప్రదార్థాలు అందివ్వనున్నట్లు పేర్కొన్నారు.

యాత్ర కర్ణాటకలోని చిత్రదుర్గం నుంచి బళ్ళారికు యాత్ర సాగనుండగా మార్గం మధ్యలో 9 కిలోమీటర్ల మేర అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం మీదుగా యాత్ర సాగనుంది. అందరమూ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని రఘువీరా పార్టీ కార్యకర్తలకు సూచించారు. యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details