PM Modi Inaugurates Sai Hira Global Convention Centre: శ్రీసత్యసాయి ట్రస్ట్ సేవలు నిరుపమానమని.. ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. పుట్టపర్తిలోని సత్యసాయి సేవా ట్రస్ట్ నిర్మించిన.. సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ను.. ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కోట్లమందికి సత్యసాయిబాబా ఆదర్శంగా నిలిచారని.. సేవా మార్గాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని.. ప్రధాని ప్రశంసించారు. జీవితాన్ని పేదలకు అంకితం చేసిన తీరు ఆదర్శనీయమన్నారు.
సత్యసాయి మహాసమాధిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీబ్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు. సాయి కుల్వంత్ మందిరంలో ట్రస్ట్ వర్గాలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత పుష్పగుచ్చాల నుంచి, ప్రత్యేకంగా దర్శించుకున్నారు. దేశంలో ఎక్కడా లభించని మానసిక ప్రశాంతత పుట్టపర్తిలో లభిస్తుందన్నారు. తర్వాత ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తున్నసాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.
డిజిటల్‌లోకి మారాలి: సత్యసాయిబాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మోదీ అన్నారు. పుట్టపర్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతిగా తెలిపారు. కోట్లమందికి సత్యసాయిబాబా ఆదర్శంగా నిలిచారని.. సత్య సాయిబాబా సేవ మార్గాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. భారత్.. ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోందని.. పుట్టపర్తిలోనూ అన్ని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో డిజిటల్‌లోకి మారాలని ప్రధాని మోదీ సూచించారు.