A Person questioned MLA about Development: 'గడప గడపకూ పభుత్వం' నినాదంతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం పి.కొత్తపల్లి పరిధిలో శాసనసభ్యుడు సిద్దారెడ్డిని ప్రజలు నిలదీశారు. మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఎదురవుతున్న ఇబ్బందులపై ఏకరవు పెట్టారు.
'అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చెప్పండి'..ఎమ్మెల్యేను నిలదీసిన సామాన్యుడు - ఎమ్మెల్యేను నిలదీసిన సామాన్యుడు
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేపట్టిన 'గడప గడపకూ పభుత్వం' కార్యక్రమానికి ప్రజల నుంచి నిరసనలు ఎదరువుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా పి.కొత్తపల్లిలో అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చెప్పాలంటూ శాసనసభ్యుడు సిద్దారెడ్డిని ఓ సామాన్యుడు నిలదీశారు.
!['అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చెప్పండి'..ఎమ్మెల్యేను నిలదీసిన సామాన్యుడు ఎమ్మెల్యేను నిలదీసిన సామాన్యుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15321460-826-15321460-1652884466625.jpg)
ఎమ్మెల్యేను నిలదీసిన సామాన్యుడు
ఎమ్మెల్యేను నిలదీసిన సామాన్యుడు