Pawan Tour: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌలురైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కల్యాణ్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనతరం అక్కడనుంచి శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చేరుకుని.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని అందించారు. అనంతరం కారుపై ర్యాలీగా బయలుదేరి యాత్రను కొనసాగిస్తున్నారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'కౌలురైతు భరోసా యాత్ర'.. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం - జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌలురైతు భరోసా యాత్ర
Pawan Tour: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శిస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర పేరు మీద శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని అందించారు.
బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం
రైతులకు అండగా: ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలను జనసేన యంత్రాంగం ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం కింద సేకరించింది. ఆ సమాచారం ప్రకారమే ఆయా జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ కలుసుకోనున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎంతో కొంత సాయం చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానంటూ.. ఇందుకు తన వంతు సాయంగా ఆయన రూ.5 కోట్లు పార్టీకి విరాళం ప్రకటించారు.
ఇదీ చదవండి: