ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Officials Stopped Locals Were Building Road Voluntarily: స్థానికులు చందాలు వేసుకుని రోడ్డు మరమ్మతు.. పనులు అడ్డుకున్న అధికారులు

Officials Stopped Locals Were Building Road Voluntarily: సొంత నగదుతో కాలనీకి రహదారి నిర్మించుకుంటున్న స్థానికులను అధికారులు అడ్డుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. రహదారి నిర్మాణమైన చేపట్టనివ్వండి.. లేదా ప్రత్యమ్నాయ మార్గాన్ని చూపండి అంటూ.. వృద్ధులు అధికారుల కాళ్లు పట్టుకుని విన్నవించినా కనికరించలేదు.

Officials_Stopped_Locals_Were_Building_Road_Voluntarily
Officials_Stopped_Locals_Were_Building_Road_Voluntarily

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 4:35 PM IST

Officials Stopped Locals Were Building Road Voluntarily: స్వచ్ఛందంగా రోడ్డు వేసుకుంటున్న స్థానికులను అడ్డుకున్న అధికారులు..

Officials Stopped Locals Were Building Road Voluntarily: శ్రీ సత్యసాయి జిల్లా హరేసముద్రం గ్రామంలో సొంత నగదుతో కాలనీకి రహదారి నిర్మించుకుంటున్న స్థానికులను అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలోని బీసీ కాలనీవాసులు స్వచ్ఛందంగా రహదారి నిర్మించుకునేందుకు చేపట్టిన పనులను అధికారులు అడ్డుకున్నారు. రహదారి నిర్మాణమైన చేపట్టనివ్వండి.. లేదా ప్రత్యమ్నాయ మార్గాన్ని చూపండి అంటూ.. వృద్ధులు అధికారుల కాళ్లు పట్టుకుని విన్నవించినా కనికరించలేదు.

Bus Fell Into Pothole on Tullur Road: రాజధాని ప్రాంతంలో గుంతలో పడిన బస్సు.. గంటపాటు శ్రమించిన స్థానికులు

వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం హరేసముద్రం గ్రామంలో బీసీ కాలనీలోని రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో ఈ రహదారిపై రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. దీనివల్ల తరచూ ప్రమాదాలబారిన పడుతున్నట్లు తెలిపారు. 40 సంవత్సరాలుగా తిరుగుతున్న రోడ్డు అధ్వానంగా మారడంతో రహదారి మరమ్మతులపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని కాలనీ వాసులు వాపోయారు. దీంతో చేసేదేమీ లేక తామే సొంత నగదుతో రహదారి మరమ్మతు పనులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కాలనీలో రహదారిని జేసీబీ ద్వారా చదును చేస్తుండగా.. ఇరిగేషన్ అధికారులు వచ్చి రహదారి నిర్మాణం చేపట్టరాదని పనులను అడ్డుకున్నారని వాపోయారు.

Road Construction in One Night: పవన్ పర్యటన.. అవనిగడ్డలో రాత్రికి రాత్రే రహదారి నిర్మాణం..

రహదారినిర్మాణమైన చేపట్టనివ్వండి.. లేదా ప్రత్యమ్నాయ మార్గాన్ని చూపండి అంటూ.. వృద్ధులు అధికారుల కాళ్లు పట్టుకుని విన్నవించినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే అధికారులు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారని కాలనీవాసులు ఆరోపించారు. అధ్వానంగా తయారైన రహదారుల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దీనివల్ల ప్రమాదాలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీలో రహదారి ఏర్పాటుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులు, కాలనీవాసులు తెగేసి చెప్పారు.

"మా గ్రామంలోని బీసీ కాలనీలో 40 సంవత్సరాలుగా తిరుగుతున్న రోడ్డు అధ్వానంగా తయారైంది. రహదారికి మరమ్మతులు నిర్వహించాలని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక మా కాలనీవాసులం, టీడీపీ నాయకులు కలిసి స్వచ్ఛందంగా సొంత నగదుతో రహదారి నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నాము. ఈ క్రమంలో కాలనీలో రహదారిని జేసీబీ ద్వారా చదును చేస్తుండగా.. ఇరిగేషన్ అధికారులు వచ్చి రహదారి నిర్మాణం చేపట్టరాదని పనులను అడ్డుకున్నారు. అధ్వానంగా తయారైన రహదారి వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. ఈ రోడ్డుపై ప్రయాణించడం వల్ల తరచూ ప్రమాదాల బారిన పడుతున్నాము. రహదారి నిర్మాణాన్ని చేపట్టనివ్వండి లేదా మరో దారి చూపండి అంటూ వృద్ధులు కాళ్లు పట్టుకొని వేడుకొన్నా.. అధికారులు కనికరించలేదు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే అధికారులు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు." - కాలనీవాసులు

Heavy Rains in Many Places in AP: ఏపీలో పలుచోట్ల కురిసిన వర్షాలకు జలమయమైన రహదారులు..

ABOUT THE AUTHOR

...view details