NTR Free Health Vehicle: ఆహారం, ఆరోగ్యం బాగుంటే మనిషి జీవనశైలి బాగుంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం చలివెందుల గ్రామంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు ప్రారంభించారు. బాలకృష్ణ 40 లక్షల రూపాయలతో ఆరోగ్య రథం అందుబాటులోకి తెచ్చారు. అన్న క్యాంటీన్ ద్వారా రూ.2కే నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ.. ఇప్పుడు గ్రామాల వద్దకే మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించడం కోసమేఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించినట్లు బాలకృష్ణ తెలిపారు. ఇది కేవలం ఆరంభమేనని.. ఇలాంటి ఉచిత ఆరోగ్య రథాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు.
హిందూపురంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన బాలకృష్ణ - Balakrishna
Nandamuri Balakrishna హిందూపురంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు ప్రారంభించారు. ఈ ఆరోగ్యరథాన్ని నియోజకవర్గంలోని పల్లెల్లో తిప్పుతూ రక్త పరీక్షలు మొదలుకుని అన్నిరకాల వైద్య చికిత్సలు అందించనున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి అందించిన వెంటిలేటర్లను మూలన పడేయడం దారుణమని బాలకృష్ణ మండిపడ్డారు.
నందమూరి బాలకృష్ణ
గ్రామస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆరోగ్య రథం ఎంతగానో ఉపయోగపడుతుందని బాలకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించేలా చంద్రబాబు చర్యలు చేపడతారని తెలిపారు. హిందూపురం ఆసుపత్రిలో కరోనా విపత్కర కాలంలో 30 వెంటిలేటర్లను అందిస్తే... వాటిని వినియోగించకుండా మూలన పడేసారంటే అంతకంటే సిగ్గుచేటు లేదని బాలకృష్ణ మండిపడ్డారు.
ఇవీ చదవండి: