MRO demoted: ప్రభుత్వ భూమిని రైతు పేరట పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చిన తహసీల్దార్‌ను డిప్యూటీ తహసీల్దార్‌గా డిమోషన్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా నంబులపూలకుంట తహసీల్దార్ పి .వెంకట రమణపై రెవిన్యూ శాఖ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. వెంకటరమణ కదిరి తహసీల్దారుగా పనిచేసే సమయంలో కదిరి పొలంలోని సర్వే నంబర్ 1784-4లోని 2.36 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక రైతు పేరిట పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేశారు.
MRO demoted: నంబులపూలకుంట తహసీల్దార్‌కు డిమోషన్... ఎందుకంటే..? - శ్రీసత్య సాయి జిల్లాలో తహసీల్దార్‌కు డిప్యూటీ తహసీల్దార్ డిమోషన్
MRO demoted: నంబులపూలకుంట తహసీల్దార్ పి.వెంకట రమణపై రెవిన్యూ శాఖ చర్యలు తీసుకుంది. తహసీల్దార్‌ను డిప్యూటీ తహసీల్దార్‌గా డిమోషన్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే..?
ఈ భూమిని గతంలో ప్రభుత్వం ఒక ఒక రైతుకు డి.పట్టా మంజూరు చేసింది. 2007-08 మధ్య ఇందిరమ్మ గృహాల కోసం అప్పటి ప్రభుత్వం సేకరించి సంబంధిత రైతుకు పరిహారం కేటాయించింది. ఈ భూమిని తహసీల్దార్ వెంకటరమణ... రైతు పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేసిన తహశీల్దార్ వెంకటరమణను డిప్యూటీ తాహసీల్దార్‌గా డిమోషన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి: