ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల నివాసాలపై పెద్దల కన్ను.. వారం రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు - ఏపీ తాజా వార్తలు

NOTICES : రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారివి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ 30ఏళ్లుగా అక్కడే జీవనం సాగిస్తున్నారు. వారి నివాసాలకు ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది. తాజాగా వారి నివాస స్థలాలపై పెద్దల కన్నుపడింది. శ్మశాన స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నారని వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ..నోటీసులు ఇచ్చారు.

NOTICES
NOTICES

By

Published : Jan 3, 2023, 12:44 PM IST

NOTICES TO JADALAMAYYAMATAM VILLAGE PEOPLE : శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని జడలయ్యమఠంలో సుమారు 42 కుటుంబాలు 3 దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. 2002లో వీరికి అప్పటి ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుంచి విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కొందరికి పక్కా గృహాలు మంజూరు చేసింది. మరికొందరు సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు.

ప్రస్తుతం స్థలాల విలువ పెరగటంతో.. మున్సిపాలిటీ పాలకవర్గంలోని కొందరి కన్ను వీటిపై పడింది. శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించారంటూ.. అధికారులపై ఒత్తిడి తెచ్చి నోటీసులు ఇప్పించారు. నోటీసులు అందటంతో కాలనీ వాసులు లబోదిబోమంటున్నారు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ స్థలాలు వదులుకునే ప్రసక్తేలేదంటున్నారు.

రాజకీయనాయకుల ఒత్తిడితో పేదల స్థలాలను ఆక్రమించాలని సూస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఎం నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేశాక ఇళ్లు ఖాళీ చేయమనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ కాలనివాసులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details