MLA Kethireddy Fires on Army Jawan : సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గుడ్మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేని అభివృద్ధిపై ఓ ఆర్మీ జవాన్ ప్రశ్నించారు. గ్రామంలో రహదారులు, డ్రైనేజీ అధ్వానంగా ఉందని ఆర్మీ జవాన్ అశ్వత్ రెడ్డి.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మీరు వస్తున్నారని రోడ్లు శుభ్రం చేశారని.. సచివాలయా ఉద్యోగులు ఎవరూ పట్టించుకోవడంలేదని నిలదీశారు. ఇలా ఉంటే గ్రామ పరిస్థితి ఏంటని ఆర్మీ జవాన్ ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అసహనానికి గురయ్యారు. ఎమ్మెల్యేను ఆర్మీ జవాన్ నిలదీసి ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గ్రామ సౌకర్యాలపై ప్రశ్నించిన జవాన్పై ఎమ్మెల్యే కేతిరెడ్డి అసహనం.. వీడియో వైరల్ - ఎమ్మెల్యే కేతిరెడ్డికి చేదు అనుభవం
Army Jawan Question to MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గుడ్మార్నింగ్ కార్యాక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లాలోని గొట్లూరు గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేని ఓ ఆర్మీజవాన్ నిలదీశారు. దీంతో కేతిరెడ్డి అసహనానికి గురైయ్యారు.
Army Jawan Question to MLA Kethireddy