ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడంటూ.. రోడ్డుపై యువతి నిరసన - In Sri Sathya Sai district man cheated girl

Love cheating: ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ.. ఓ యువతి నడి రోడ్డుపై నిరసనకు దిగింది. బాధిత యువతికి కులవివక్ష పోరాట సమితి మద్దతు పలికింది. మహిళల రక్షణ కోసం దిశాయాప్ ఉందని ఘనంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వానికి.. బాధిత యువతి గోడు కనిపించడం లేదా అని స్థానికులు వాపోతున్నారు.

A young man cheats in the name of love
ప్రేమ పేరుతో యువకుడు మోసం

By

Published : Dec 17, 2022, 5:57 PM IST

Updated : Dec 17, 2022, 7:02 PM IST

Love cheating: ప్రేమ పేరుతో యువకుడు మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడం లేదంటూ రోడ్డుపై బైఠాయించి యువతి నిరసన చేపట్టింది. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం కిరికేరా గ్రామానికి చెందిన యువతి, కర్నూలు జిల్లాకు చెందిన గణేష్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం శారీరకంగా లోబర్చుకుని, పెళ్లి మాట వచ్చేసరికి మొహం చాటేశాడని యువతి ఆరోపించింది. తనను మోసం చేశాడని, గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తనను పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత యువతిపై పోలీసులు కుల వివక్షత చూపుతున్నారని కుల వివక్ష పోరాట సమితి సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామంటూ పోలీసులు చెబుతున్న తనకు రక్షణ ఎక్కడ కల్పించారు అంటూ పోలీసు శాఖను ఆ యువతి నిలదీసింది.

Last Updated : Dec 17, 2022, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details