ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

Leopard migration in Sri Sathyasai district: శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత సంచారం స్ధానికులను కలవరానికి గురి చేసింది. ఊరి మధ్యలో ఉన్న కొండపైనున్నకోట గోడ వద్ద చిరుత సంచారం గ్రామస్తుల కంట పడింది. వణ్యప్రాణుల దాడుల నుంచి ప్రజలను, పశువులను కాపాడే విధంగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

By

Published : Nov 11, 2022, 2:10 PM IST

leopard
చిరుత పులి

Leopard in Sri Sathyasai district: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండల కేంద్రంలో చిరుత సంచారం.. ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది. ఊరి మధ్యలో ఉన్న కొండపైనున్నకోట గోడ వద్ద చిరుత పచార్లు చేయడాన్ని స్థానికంగా కొందరు సెల్ ఫోన్లో బందించారు. ఇప్పుడు ఈ దృశ్యాలు స్థానికంగా వైరల్ గా మారాయి. గ తంలో ఇదే కొండపై ఎలుగు బంట్లు కూడా కనిపించాయి. చిరుతల, ఎలుగుబంట్ల సంచారం అధికమవ్వడంతో... వన్యపారుల నుంచి ఎలాంటి హాని జరుగుతుందోనని.. స్థానికంగా నివాసముంటున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేత కోసం వెళ్లే పశువుల కాపరులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వణ్యప్రాణుల దాడుల నుంచి ప్రజలను, పశువులను కాపాడే విధంగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత సంచారం

ABOUT THE AUTHOR

...view details