ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ప్రాంతంలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు... - చిరుత వార్త

Leopard creates ruckus in sri sathya sai: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ పరిసరాల్లో చిరుత సంచారం భయాందోళన రేకెత్తిస్తోంది. తాజాగా నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద చిరుత ప్రత్యక్షమైంది. అక్కడ ఉన్న నీటితొట్టెలో నీరు తాగి వెళ్లిపోయింది. మిద్దెపైనుంచి స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది.

చిరుత సంచారం
Leopard creates ruckus

By

Published : Dec 10, 2022, 8:47 PM IST

గుడిబండ పరిసరాల్లో చిరుత సంచారం

leopard at house: గత కొంత కాలంగా అటవీ జంతువుల బెడద ఎక్కువైపోతున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. జనవాసాల్లోకి వస్తున్న అటవీ జంతువులను ఎదుర్కొనేందుకు ప్రజలు, అటవీ అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ అటవీ జంతువుల నుంచి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ పరిసరాల్లో చిరుత సంచారం భయాందోళన రేకెత్తిస్తోంది.

ఈ ప్రాంతలో గత కొద్ది రోజులుగా.. ఎలుగుబంట్లు, చిరుతల సంచారం అధికమయ్యాయి. గుడిబండ మండల కేంద్రంలో శివారున నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఈరోజు ఉదయం చిరుతపులి నీటి తొట్టెలోని నీటిని తాగి వెళ్లింది. ఇది చూసిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిద్దె పై భాగం నుంచి స్థానికులు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. వృద్ధులు, చిన్నపిల్లలు, ఒంటరిగా ఉన్న వారిపై ఎప్పుడు ఏ క్షణాన చిరుత దాడి చేస్తుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు వన్యప్రాణాల నుంచి ప్రజలను కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details