Leopard: శ్రీ సత్యసాయి జిల్లాలోని కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలకు నిద్ర లేకుండా చేసిన చిరుత పులిని కర్ణాటక అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని చిలమత్తూరు, లేపాక్షి మండలాల సరిహద్దు ప్రాంతంలోని ఆదినారాయణ కొండ గ్రామ సమీపంలో చిరుత పులి సంచరిస్తోంది. ఈ విషయాన్ని సరిహద్దు గ్రామాల ప్రజలు.. అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కర్ణాటక అటవీ శాఖ అధికారులు ఎంతో చాకచక్యంగా చిరుతపులిని పట్టుకున్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకముందే చిరుతపులిని బంధించడంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Leopard: చిరుతపులిని బంధించిన కర్ణాటక అటవీ శాఖ అధికారులు - చిరుతను బంధించిన కర్ణాటక అటవీ అధికారులు
Leopard: ఇటు ఆంధ్రప్రదేశ్..అటు కర్నాటక సరిహద్దు గ్రామాల ప్రజలను నిద్ర లేకుండా చేసిన చిరుతపులిని కర్ణాటక అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
చిరుతపులిని బంధించిన కర్ణాటక అటవీ శాఖ అధికారులు