వచ్చాడు..వెళ్లాడు అన్న చందంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సాగిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పర్యటనతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఒరిగిందేమీ లేదని అన్నారు. సీఎం పర్యటన నిస్సహాయంగా, నిస్సత్తువుగా సాగిందని విమర్శించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులపై నోరుమెదపకపోవటం దుర్మార్గమన్నారు.
Kalava: 'జగన్ పర్యటనతో ఒరిగిందేం లేదు.. ఆ విషయంపై నోరుమెదపకపోవటం దుర్మార్గం' - సీఎం జగన్‌పై కాలవ కామెంట్స్
ముఖ్యమంత్రి జగన్ పర్యటనతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఒరిగిందేమీ లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు దుయ్యబట్టారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులపై సీఎం జగన్ నోరుమెదపకపోవటం దుర్మార్గమన్నారు.
జగన్ పర్యటనతో ఒరిగిందేం లేదు
తెదేపా హయాంలో రైతులకు రూ.1,126 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుంతుందని కాలవ కొనియాడారు. రూ. 11 వేల కోట్లతో రైతులకు డ్రిప్ పరికరాలు అందించి రైతు సంక్షేమానికి చంద్రబాబు పాటుపడ్డారని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో నిలిచిందని దీనికి సీఎం జగన్ అసమర్థ పాలనే కారణమని కాలవ మండిపడ్డారు.
ఇవీ చూడండి