శ్రీ సత్య సాయి జిల్లా విషాదం నెలకొంది. నేడు విడుదలైన ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడని మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామానికి చెందిన నందకిషోర్ కుమార్.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఈరోజు ఫలితాలు వెలువడగా.. ఫెయిలయ్యాడు. దీంతో మనస్థాపం చెంది.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే విద్యార్థి మృతి చెందాడు. నందకిషోర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇంటర్ పరీక్షలో ఫెయిల్... ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య - సత్యసాయి జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Student Suicide: ఎన్నో కలలు కన్నారు.. ఇంటర్ తరువాత ఉన్నత చదువులు చదవాలనుకున్నారు.. కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈరోజు వచ్చిన ఇంటర్ ఫలితాల్లో వాళ్లు ఫెయిలయ్యారు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు... బతకడం వ్యర్థమనుకున్నారు.. క్షణికావేశంలో ఒకరు చెరువులో దూకి ప్రాణాలు తీసుకోగా.. మరొకరు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చారు.
విజయవాడ పురుషోత్తపట్నంలో రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విజయవాడ-విశాఖపట్నం ప్రధాన రైల్వే ట్రాక్‌పై గన్నవరం మండలం పురుషోత్తపట్నం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, రైల్వే పోలీసుల కథనం మేరకు.. గన్నవరం మండలం కొండపావులూరు పంచాయతీ శివారు ముదిరాజ్‌పాలెంకు చెందిన 18 సంవత్సరాల బోనం చినవెంకటనాగసాయి విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివాడు. మార్చిలో రాసిన ద్వితీయ సంవత్సర తుది పరీక్షా ఫలితాలు వెలువడగా.. అందులో నాగసాయి ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగసాయి.. పురుషోత్తపట్నం రైల్వేగేట్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న విజయవాడ రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తాపీమేస్త్రిగా జీవనం సాగించే ప్రసాద్, నళిని దంపతుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది.
ఇదీ చదవండి:
TAGGED:
inter student suicide