Accident In Shri Sathya Sai District : శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలోని పెద్ద చెరువు కట్ట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న సిమెంట్ లారీని వెనుక నుండి ఇన్నోవా కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వీరు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని కొడవండ్లపల్లి గ్రామంలో.. ఒక వివాహ నిశ్చితార్థానికి వెళ్తున్న సమయంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న సిమెంట్ లారీని వెనక నుండి ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు సత్యనారాయణ(55), నంజుండప్ప(70) గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని బెంగళూరుకి తరలిస్తున్నారు.
సత్యసాయి జిల్లాలో నిలిపి ఉంచిన లారీని ఢీ కొన్న కారు...ఇద్దరు మృతి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
Accident In Shri Sathya Sai District : శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలోని పెద్ద చెరువు కట్ట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Etv Bharat