ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంపుతానని హెచ్చరించిన భర్త.. భయంతో భర్తనే చంపేసిన భార్య - నేర వార్తలు

Husband Murderd By Wife: భర్త అర్ధరాత్రి వరకు గొడవ జరగడంతో తనపై అఘాయిత్యానికి పాల్పడతారని భయంతో ఆమె కర్రతో తలపై మోదింది. అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది.

భర్తను చంపిన భార్య
భయంతో భర్తనే చంపేసిన భార్య

By

Published : Dec 31, 2022, 12:54 PM IST

Updated : Dec 31, 2022, 2:54 PM IST

Husband Murderd By Wife: శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని మంచేపల్లి గ్రామంలో బోయ రాధమ్మ తన భర్త బోయ ఆంజనేయులు కుటుంబ కలహాల కారణంగా కర్రతో తలపై మోదడంతో అక్కడికక్కడే మరణించాడు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు సంతానం. భర్త ప్రతిరోజు ఇంట్లో గొడవ పడుతుండడంతో రోజులాగే శుక్రవారం రాత్రి కూడా భర్త గొడవపడ్డాడు. చంపుతానని పలుమార్లు హెచ్చరించాడు. అర్ధరాత్రి వరకు గొడవ జరగడంతో.. ఏదో ఒక సమయంలో తనపై అఘాయిత్యానికి పాల్పడతారని భయంతో ఆమె కర్రతో తలపై మోదింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చంపుతానని హెచ్చరించిన భర్త.. భయంతో భర్తనే చంపేసిన భార్య
Last Updated : Dec 31, 2022, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details