ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Electricity Bill: "కరెంట్ బిల్లు" రాక్.. వినియోగదారుడు షాక్..! - కరెంట్ బిల్లు చూసి వినియోగదారుడు షాక్

Electricity Bill: కరెంటు కోతలతో సతమతమవుతున్న ప్రజలను.. విద్యుత్ బిల్లులు విస్మయానికి గురిచేస్తోన్నాయి. వందల్లో రావాల్సిన బిల్లులు కాస్తా.. వేలల్లో వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. ఎప్పుడూ చూడని బిల్లును చూడడంతో ఆ యజమాని షాక్​కు గురయ్యాడు.

Electricity Bill
కరెంట్ బిల్లు చూసి వినియోగదారుడు షాక్

By

Published : Apr 10, 2022, 3:32 PM IST

Electricity Bill: సత్యసాయి జిల్లా హిందూపురంలో కరెంటు బిల్లును చూసి ఓ యజమాని షాక్​కు గురయ్యాడు. 500 రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు ఏకంగా 64 వేల రూపాయలు రావడంతో అతడు ఆందోళన చెందుతున్నాడు. హిందూపురం పట్టణంలోని ముక్కడిపేటకు చెందిన అబ్దుల్ తన ఇంటికి ప్రతినెల 500 రూపాయల చొప్పున విద్యుత్ బిల్లు వచ్చేదని తెలిపాడు. అయితే..ఏప్రిల్ నెల విద్యుత్ బిల్లు ఆకాశాన్నంటేలా 64 వేల 211 రూపాయలు రావడం చూసి అవాక్కయ్యానన్నాడు.

ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దానిని పరిశీలించి, ఈ తప్పిదాన్ని సరి చేస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా వచ్చే ఈ విద్యుత్ బిల్లుల తప్పిదాలను అధికారులు సత్వరమే సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: మాచర్లలో టెన్షన్​.. పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామాకు సిద్ధమవుతున్న నేతలు

ABOUT THE AUTHOR

...view details