Hindupuram MLA Nandamuri Balakrishna Meets TDP Activists: మూడు రోజుల పర్యటనలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. పట్టణం, గ్రామీణ మండలాల్లో నెలకొన్న సమస్యలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ చర్చించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటుగు పార్టీ పట్టిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తనతో చెప్పాలని, సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. గ్రౌండ్ లెవల్లో నేతలు, కార్యకర్తలను సమీకరిస్తూ వారి అభిప్రాయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
సీఎం రేవంత్‌కు అఖండ ఆశీస్సులు - మీ మార్క్ పాలనతో తెలంగాణకు శ్రీరామరక్ష
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అంతర్గత సమీక్ష సమావేశాలు నిర్వహించారు. హిందూపురం మండలం పూలకుంట గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో హిందూపురం మండలంలోని 14 పంచాయతీలు ఉండగా, ఒక్కో పంచాయతీ నుండి నాయకులు, కార్యకర్తలతో అంతర్గత సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని విషయాల పైన దిశా నిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల వల్ల ఎదురవుతున్న సమస్యలను వివరించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి బాలయ్య దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరించే దిశగా నియోజకవర్గంలోని నేతలు, కార్యక్తలకు నందమూరి బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను చూసుకుంటానని చెప్పినట్లు కార్యక్తలు తెలిపారు. బాలకృష్ణతో జరిగిన సమీక్ష సమావేశాల అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో గ్రామాలకు తిరిగి వెళ్లారు.