ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సౌకర్యాలు కల్పించండి మహాప్రభూ.. ప్రభుత్వాస్పత్రిలో రోగుల బంధువుల ఆందోళన - Patients protest in front of the Collector

Patients Protest For Minimum Facilities: పేద ప్రజలు అనారోగ్యంతో ఉంటే వారి కళ్లు ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూస్తాయి. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోతే వారి చూపును ఎటు తిప్పాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కలెక్టర్​ ఆధ్వర్యంలో మీటింగ్​ జరుగుతుండగా రోగుల బంధువులు ఆందోళన చేపట్టిన ఘటన హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 6, 2023, 5:21 PM IST

Patients Protest For Minimum Facilities: ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని రోగుల తరఫు బంధువులు నిరసనకు దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన కలెక్టర్‌ను కలిసి సమస్యలు వివరించేందుకు యత్నించారు. సిబ్బంది అనుమతించకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరుగుతున్న గది బయట నిల్చోని నినాదాలు చేశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు ఉంటే వైద్యం కోసం తమకు బెంగుళూరు వెళ్లే అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నామమాత్రంగా నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి...కలెక్టర్ ఎదుట రోగుల నిరసన

ABOUT THE AUTHOR

...view details