Heavy rain in Madakasira: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రాంతంలో బుధవారం రాత్రి 7 నుంచి 10 గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. అరేపేట వీధిలోని లోతట్టు ప్రాంతంలొ ఇళ్లల్లో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై భారీగా నీరు చేరడంతో చాలాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎప్పుడూ వర్షం కురిసినా మా ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
మడకశిరలో కుండపోత వర్షం.. రోడ్డు, లోతట్టు ప్రాంతాలు జలమయం - sathya sai district news
Heavy rain in Madakasira: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో రాత్రి భారీ వర్షం పడింది. పట్టణంలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షం