ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్ని ఫార్మెట్లలోనూ.. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న తెలంగాణ మద్యం అమ్మకాలు ! - ఆంధ్రప్రదేశ్ మద్యశాఖ వార్తలు

Telangana Liquor Sales 2022: రాష్ట్రంలో 2022 ఏడాదిలో భారీగా మద్యం అమ్ముడైంది. రూ. 34,353 కోట్లు విలువైన లిక్కర్‌, బీర్లను మద్యం ప్రియులు తాగేశారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.7,890 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. లిక్కర్‌ కంటే ఎక్కువగా బీర్లు అమ్ముడుపోయాయి.

TELANGAN
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు

By

Published : Jan 2, 2023, 10:45 AM IST

Telangana Liquor Sales 2022: రాష్ట్రంలో ఏటికేడు మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. 2021 సంవత్సరంలో రూ.30,222 కోట్ల మద్యం అమ్ముడు పోగా.. 2022 సంవత్సరంలో ఈ రికార్డు చెదిరిపోయింది. రూ.4 వేల కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్ముడుపోయింది. 2022లో రూ.34,532 కోట్లు విలువైన లిక్కర్‌, బీరు విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2022లో జరిగిన ఉప ఎన్నికలు సహా మద్యం తాగేవారి సంఖ్య పెరగడం ఇందుకు దోహదం చేసినట్లు భావిస్తున్నారు.

2022లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.7,890 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయింది. హైదరాబాద్‌ జిల్లాలో రూ.3,683 వేల కోట్లు, నల్గొండ జిల్లాలో రూ.3,467 కోట్లు, వరంగల్‌ జిల్లాలో రూ.3,415 కోట్ల చొప్పున విక్రయాలు జరిగాయి. 2022 జనవరి నెలలో రూ.2,548 కోట్లు విలువైన 31.93 లక్షల కేసుల లిక్కర్‌ తాగేశారు. 24.81 లక్షల కేసులు బీరు అమ్ముడుపోయింది. ఫిబ్రవరి నెలకు వచ్చేప్పటికి బీరు అమ్మకాలు.. లిక్కర్‌ కంటే ఎక్కువ జరిగాయి. ఆ తర్వాత కూడా బీరు విక్రయాలు పెరుగుతూ వచ్చాయి. డిసెంబరు నెలలో ఏకంగా రూ.3376 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. 2021లో రోజుకు సగటున రూ.82 కోట్ల 80 లక్షల విలువైన మద్యం అమ్ముడు పోగా.. 2022లో రోజుకు సగటున రూ.94 కోట్ల 11 లక్షల విలువైన మద్యం విక్రయించారు. అంటే 2021తో పోలీస్తే.. 2022లో రోజుకు రూ.12 కోట్ల లెక్కన అధికంగా విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు కడుతోంది.

కొత్త సంవత్సరం మూలంగా... డిసెంబరు నెల చివరి వారంలో ఆరు రోజులకు ఏకంగా రూ.1,111 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబరు 26న రూ.182.28 కోట్లు, 27న రూ.155.29 కోట్లు, 28న రూ.144.79 కోట్లు, 29న రూ.159.14 కోట్లు, 30న రూ.254 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. 2022 డిసెంబరు 31న రూ.216 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం ద్వారా వచ్చే రాబడి కూడా.. ఈ ఏడాదిలోనూ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details