ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ఊళ్లను వీడిన అజ్ఞాతం, ఎట్టకేలకు దక్కిన గుర్తింపు - మూడేళ్ల నిరీక్షణకు తెర - సీబీఆర్​ జలాశయం

Government Recognized CCrevu, Marrimakulapally: రిజర్వాయర్‌ కోసం స్వంత గ్రామాన్ని అయినోళ్లను, పొలాలను వదులుకుని దూరప్రాంతాలకు వెళ్లిన వారికి ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత గుర్తింపు దక్కింది. ప్రభుత్వ గుర్తింపు నోచుకోక ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందిపడుతున్న వారికి 'ఈటీవీ - ఈటీవీ భారత్' కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. ఇటీవలే సత్యసాయి జిల్లా సీసీరేవు పంచాయతీ పరిధిలోని సీసీరేవు, మర్రిమాకులప్లలి గ్రామాలను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

government_recognized_cc_revu_marrimakulapally
government_recognized_cc_revu_marrimakulapally

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 11:16 AM IST

రెండు ఊళ్లను వీడిన అజ్ఞాతం, ఎట్టకేలకు దక్కిన గుర్తింపు - మూడేళ్ల నిరీక్షణకు తెర

Government Recognized CCrevu, Marrimakulapally :ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలో చిత్రావతి నదిపై సీబీఆర్​ జలాశయం నిర్మించారు. కడప జిల్లాలో తాగు, సాగునీటి అవసరాల కోసం జలాశయం నిర్మాణం చేపట్టగా ముంపు ప్రాంత వాసుల్లో కొందరికే పునరావాసం కల్పించారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటినిల్వ చేయకపోవడంతో చాలామంది ముంపు గ్రామాలను వీడకుండా అక్కడే నివాసం ఉన్నారు. 2021లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ చేయడంతో సీసీరేవు, మర్రిమాకులపల్లి మునిగిపోయింది. ప్రజలు ప్రాణభయంతో అదే గ్రామాల పరిధిలోని సురక్షిత ప్రాంతంలో కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు.

చిత్రావతి ముంపు బాధితులను పట్టించుకోని అధికారులు..

'మూడేళ్లుగా మా గ్రామాల్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. కనీసం మా ఈరిలో వారికి ఓటుహక్కు కూడా కల్పించడం లేదు. అధికారులు, పాలకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం దక్కలేదు. గ్రామాలకు గుర్తింపు లేకపోవడంతో మాకు ఏ ప్రభుత్వ సంక్షేమ పథకమూ అందడం లేదు. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో మేము ఈ టీవీ వారిని సంప్రదించాము. మా ఇబ్బందులపై ఈటీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. ఈ రెండు గ్రామాలను గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈటీవీ చొరవతోనే మాకు గుర్తింపు లభించింది. మా ఊర్ల కోసం 'ఈటీవీ - ఈటీవీ భారత్' వారు చేసిన సహాయం వల్లే మేము ఈ రోజు సంతోషంగా ఉన్నాం.'-రహ్మతుల్లా, మర్రిమాకులపల్లి, సోమశేఖర్ నాయుడు.

శ్రీశైలం వెలవెల.. కేసీ కెనాల్​కు నీటి విడుదల బంద్.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన..

Government Recognized Two Villages In Satyasai District : ఈ రెండు గ్రామాల్లో 2,200 మంది ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో నివాస, వ్యవసాయ భూములు 4,213 ఉండగా...1,720 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. నీటి ముంపుపోగా, మిగిలిన భూమిలోనే కొత్తగా గ్రామాలు నిర్మించుకున్నందున ఆ గ్రామాలను కొత్తగా గుర్తించాల్సిన అవసరంలేదని, పాత పేర్లతోనే కొనసాగిస్తున్నట్లు ఆదేశాల్లో చెప్పారు. ఈ నోటిఫికేషన్‌తో సీసీరేవు, మర్రిమాకులపల్లి గ్రామస్తులకు ఓటుహక్కుతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనున్నాయి. అయితే గతంలో పోలీసుల బెదిరింపులతో మర్రిమాకులపల్లి గ్రామస్తులను ఖాళీ చేయించిన ప్రభుత్వం... అక్కడి 119 ఎస్సీ కుటుంబాలకు నేటికీ పునరావాస ప్యాకేజీ సొమ్ము అందించలేదు.

నాలుగేళ్లుగా కన్నీళ్లే మిగిలాయి.. ప్రభుత్వమే మాట తప్పితే.. పట్టించుకునే వారు ఎవరు..?

ప్రస్తుతం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు వేగంగా జరుగుతున్నందున దాదాపు 1600 మంది ఓటర్లు ఉన్న సీసీరేవు, మర్రిమాకులపల్లి గ్రామాల ప్రజలకు ఓటు హక్కు కల్పించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

చిత్రావతి ముంపు బాధితులకు న్యాయం చేయాలి: గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details