Gift to PM Modi: ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానికి బహుకరించేందుకు.. ఖాదీ గ్రామోద్యోగ సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు మోదీ చిత్రంతో కూడిన పట్టు వస్త్రాన్ని తయారు చేయించారు. డిజైనర్ నాగరాజు రూపొందించిన దీనిని.. నాలుగు రోజులపాటు నలుగురు చేనేత కార్మికులు తయారు చేశారు. యోగముద్రలో ఉన్న ప్రధాని చిత్తరువును ముద్రించారు. రూ.15 వేలతో రూపొందించిన ఈ బహుమతిని.. ఖాదీ సంస్థ ప్రతినిధుల ద్వారా పంపనున్నట్లు.. ఖాదీ గ్రామోద్యోగ సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.
GIFT TO MODI ప్రధాని మోదీకి ధర్మవరం చేనేత కళాకారుల అరుదైన బహుమతి - ప్రధాని మోదీకి మరపురాని బహుమతి
Gift to PM Modi: ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి మరపురాని బహుమతి సిద్ధం చేశారు.. ధర్మవరానికి చెందిన చేనేత కళాకారులు. ఖాదీ గ్రామోద్యోగ సంస్థ ఉద్యోగులు మోదీ చిత్రంతో కూడిన పట్టు వస్త్రాన్ని తయారు చేయించారు.
ప్రధాని మోదీకి మరపురాని బహుమతి