Raghuveera Reddy: శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం తన స్వగ్రామమైన నీలకంఠాపురం గ్రామంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి రైతుగా మారారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాన్య జీవితం గడుపుతూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో తన పొలంలో కోతకు వచ్చిన రాగి పంటను వ్యవసాయ కూలీలతో కలిసి ఆధునిక యంత్రంతో స్వయానా తనే కోత కోసి ఆనంద చకితుడయ్యారు. రఘువీరారెడ్డి తిరిగి రాజకీయాల్లో ఎప్పుడు చురుగ్గా పాల్గొంటారా..? అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Raghuveera Reddy: పంట కోసిన రఘువీరారెడ్డి - పొలంలో పంటకోసిన రఘువీరారెడ్డి
Raghuveera Reddy: పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రైతుగా మారారు. తన పొలంలో కోతకు వచ్చిన పంటను స్వయంగా ఆధునికి యంత్రాలతో కోసి ఆనందంలో మునిగి తేలారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు.
పంట కోస్తున్న రఘువీరా రెడ్డి