ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురంలో రోడ్డుపై పూలు చల్లి.. బైఠాయించి వ్యాపారుల నిరసన - పూల వ్యాపారికి పూలు అమ్మడానికి ఎక్కడా లేదు

Florists protest: పూలు అమ్ముకోవడానికి స్థలం కేటాయించాలంటూ వ్యాపారస్తులు పలుమార్లు విన్నవించుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక హిందూపురంలో వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై పూలు చల్లి బైఠాయించారు.

florists
పూల వ్యాపారులు

By

Published : Jan 5, 2023, 3:26 PM IST

Florists Protest: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో రోడ్డుపై పూలను పారబోసి వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేశారు. పూలు అమ్ముకోవడానికి స్థలం కేటాయించాలంటూ పలుమార్లు విన్నవించుకున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వ్యాపారస్తులు వాపోయారు. తాత్కాలికంగా ఇప్పుడు నిర్వహిస్తున్న హిందూపురం పట్టణంలోని పశుసంవర్ధక శాఖ రైతు శిక్షణ భవన పరిసరాల్లో పూల మార్కెట్​ను ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచక పూలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు.

వ్యాపారం చేసుకోవడానికి స్థలం లేకపోవడంతో తమ భవిష్యత్తు గందరగోళంగా ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురం-అనంతపురం వెళ్లే ప్రధాన రహదారిపై పూలను పారబోసి రాస్తారోకో నిర్వహించారు. అధికారులు నిరసనకారులతో చర్చించి నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపల్ కాంప్లెక్స్​లో స్థలం కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details