Cow Rescued: ప్రమాదవశాత్తూ పంట పొలాల్లోని వ్యవసాయ బావిలో పడిపోయిన ఆవును సురక్షితంగా బయటకు తీసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పరిగి మండలం చిన్నపల్లి గ్రామ సమీపంలో పంట పొలాల్లోని వ్యవసాయ బావిలోకి ప్రమాదవశాత్తు ఆవు పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. హిందూపురం అగ్నిమాపక శాఖ సిబ్బంది బావిలో పడ్డ ఆవుని ఒక క్రేన్ సహాయంతో బయటకు సురక్షితంగా తీసుకువచ్చారు. ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న గ్రామస్థులు బావి వద్దకు చేరుకుని ఆవును బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బందికి సహాయ సహకారాలు అందించారు.
బావిలో పడిన ఆవు.. రక్షించిన అగ్నిమాపక సిబ్బంది - ఏపీ తాజా వార్తలు
Cow fall in well - rescued safely: ఓ ఆవు బావిలో పడింది.. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరిన సిబ్బంది.. క్రేన్ సహాయంతో ఆవును రక్షించారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది.
cow