Father Killed his Son In Sri Sathya Sai Distt:శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో కన్నకొడుకుని హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. రామగిరికి చెందిన గంగరాజుకు, శివాపురానికి చెందిన కవితతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్ల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్యను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కవితను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఆ సమయంలో భార్య కవిత కడుపుతో ఉండి బిడ్డకు జన్మనివ్వటంతో గంగరాజు అనుమానం మరింత పెరిగింది. ఆ బిడ్డను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నగంగరాజు.. భార్యకు మాయమాటలు చెప్పి బిడ్డను బయటకు తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ బిడ్డ ఇంటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన కవిత.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపగా నిందితుడు హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.
భార్యపై అనుమానం...కొడుకును కడతేర్చిన తండ్రి - Suspicion on wife
Father Killed his Son In Sri Sathya Sai Distt:మానవ సంబంధాలు మంటగలిసే ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. భార్యపై అనుమానం పెనుభూతమై చివరికి కన్న కొడుకుని పాసవికంగా చంపేశాడు ఓ నరరూప రాక్షసుడు. తండ్రి భుజాలపై కొడుకు లోకాన్ని చూస్తాడు అంటారు. అటువంటి తండ్రే కిరాతకుడై ఆ పసి బాలున్ని కానరాని లోకాలకు పంపేశాడు. ఇటువంటి అమాననియమైన సంఘటన పెనుకొండలో చోటుచేసుకుంది.
Father Killed his Son
Last Updated : Dec 28, 2022, 11:26 AM IST