Farmers Locked Tahsildar Office : శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని కోగిరా కంబాలపల్లి శ్యాపురం గ్రామాల్లోని భూమిలేని రైతులు గత కొంతకాలంగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. సోమవారం సాగులో ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని సీపీఎం, కెవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. పట్టాలు ఇచ్చేందుకు ఒక్కో రైతు రూ.10 వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్ సూచించినట్లు ప్రజాసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ కు ఫిర్యాదు చేస్తామన్నారు.
పట్టాలు ఇవ్వాలని.. తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన రైతులు - సత్యసాయి జిల్లా రైతులు తహశీల్దార్ ఆఫీస్ కు తాళం
Farmers Locked Tahsildar Office : సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని.. తహసీల్దార్ కార్యాలయానికి సీపీఎం, కెవీపీఎస్ నాయకులు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా రొద్దం మండలంలో జరిగింది.
తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన రైతులు