శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. నరసింహపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ నాయక్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఐదేళ్లుగా పట్టాదారు పాస్ పుస్తకం కోసం తిరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని భాస్కర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలు వెంటనే ఇవ్వాలంటూ పోలీస్, రెవెన్యూ అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. పెట్రోల్ పోసుకున్న భాస్కర్ నాయక్‌ను పోలీసులు అడ్డుకుని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం.. కారణం అదే..! - రైతు ఆత్మహత్యాయత్నం వార్తలు
రెవెన్యూ అధికారులు.. పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వటం లేదని ఓ రైతు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది.

farmer suicide attempt
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా...!
TAGGED:
రైతు ఆత్మహత్యాయత్నం వార్తలు