Farmer Death with Electrical Shock: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పశువులను మేత కోసం తీసుకెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. సత్యసాయి జిల్లాలో తాడిమర్రి అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలాల్లో విద్యుత్ తీగలు తెగిపడి కూలీలు మృతి చెందిన ఘటన మరువక ముందే శ్రీసత్య సాయి జిల్లా నంబులపూలకుంట వద్ద 11 కేవీ విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన పింగాణీ దెబ్బతిని తీగలు తెగిపడ్డాయి. అదే సమయంలో అటుగా వస్తున్న నంబుల పూలకుంటకు చెందిన రైతు రెడ్డప్ప మీద విద్యుత్ తీగల పడ్డాయి. ప్రమాదంలో రెడ్డప్ప రెడ్డి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని విద్యుత్ సరఫరాను నిలిపివేయించి మృతదేహాన్ని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు మృతుడు రెడ్డప్ప రెడ్డికి భార్య ఇద్దరు సంతానము ఉన్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం రైతు మృతికి కారణమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి - విద్యుత్ షాక్
Farmer Death with Electrical Shock: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పశువులను మేత కోసం తీసుకెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శ్రీసత్య సాయి జిల్లా నంబులపూలకుంటలో జరిగింది.
Electrical Shock