FARMER COUPLE SUICIDE ATTEMPT : అధికారులు 2004లో తమకు ఇచ్చిన పట్టాభూమిలో వరి సాగు చేయకుండా వైసీపీ వారు అడ్డుకుంటున్నారంటూ శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. రొద్దం మండలం కోగిర గ్రామానికి చెందిన అంజనప్ప, అతని అన్న గంగాద్రి దంపతులు పొలంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో కొన్నేళ్లుగా తెదేపా మద్దతుదారుడైన గంగాద్రి, అతని తమ్ముడు అంజనప్ప చెరో రెండు ఎకరాల చొప్పున సాగు చేసుకుంటున్నారు.
జగనన్న ఇదేందిది.. నాట్లు కూడా వేయనీయడం లేదు.. జర చూడరాదు! - సత్యసాయి జిల్లా తాజా వార్తలు
FARMER COUPLE SUICIDE ATTEMPT: అధికారులు తమకు ఇచ్చిన పట్టాభూమిలో వరిసాగు చేయనీయకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆవేదన చెందిన దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది.
ఇటీవల అంజనప్ప వరి సాగు చేయబోగా వైకాపాకు చెందిన గంగాధర్, అతని కుటుంబ సభ్యులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోంది. గంగాద్రి దంపతులు గురువారం వరినాట్లు వేసేందుకు సిద్ధం కాగా.. గంగాధర్ మనుషులు అడ్డుకున్నారు. బాధితులు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోబోగా స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పటికే పోలీసులు, మండల, డివిజన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గంగాద్రి దంపతులు వాపోయారు. ఈ విషయంపై రొద్దం తహసీల్దార్ అనంతాచారిని వివరణ కోరగా.. తమకు పట్టాలున్నాయని ఇరువర్గాల వారూ చెబుతున్నారని.. విచారించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇవీ చదవండి: