Fake notes in government liquor store: శ్రీ సత్య సాయి జిల్లా తలుపుల మండలంలో నకిలీనోట్ల చలామణి ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వ వైన్ షాప్‌లో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. తలుపుల మండలంలోని ప్రభుత్వ వైన్ షాప్‌లో మద్యం కొనుగోలు చేసిన ఒక వ్యక్తికి ఉద్యోగులు చిల్లరగా 200 రూపాయల నోటును ఇచ్చారు. రాత్రి ఇంటికి వెళ్లి చూసుకోగా దాన్ని దొంగనోటుగా గుర్తించారు. లేటుగా విషయం తెలుసుకున్న వ్యక్తి వైన్ షాప్ వద్దకు వెళ్లి అడిగితే సిబ్బంది తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. నోటును మార్చేది లేదని తేల్చి చెప్పారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు.
సత్య సాయి జిల్లాలో నకిలీ నోట్లు కలకలం.. ఆందోళనలో ప్రజలు - Andhra Pradesh Latest News
Fake notes in government liquor store: రాష్ట్రంలో నకిలీ నోట్ల బెడద రోజరోజుకీ పెరిగిపోతోంది. రోజుకో జిల్లాలో ఈ నకిలీ నోట్లు వెలుగు వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ వైన్ షాప్‌లో దొంగ నోట్లు వేలుగు లోకి రావడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు.
సత్య సాయి జిల్లాలో నికిలీ నోట్లు కలకలం.. ఆందోళనలో ప్రజలు
Last Updated : Jan 7, 2023, 1:31 PM IST