ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ex-Minister Dance: యువకులతో కలిసి.. మాజీ మంత్రి రఘువీరారెడ్డి స్టెప్పులు - మాజీ మంత్రి రఘువీరారెడ్డి నృత్యాలు వార్తలు

Ex-Minister Dance: మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.. మట్టిలో తడిసిన బట్టలతో యువతతో కలిసి చిందులు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు.. రఘువీరారెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించగా.. ఉట్లమాను ఉత్సవ కార్యక్రమాలతో ముగిశాయి. ఈ సందర్భంగా.. మాజీమంత్రి సాదాసీదా వ్యక్తిలా యువకులతో కలిసి నృత్యాలు చేశారు.

1
యువకులతో మాజీ మంత్రి రఘువీరారెడ్డి నృత్యాలు

By

Published : Apr 13, 2022, 9:52 AM IST

యువకులతో మాజీ మంత్రి రఘువీరారెడ్డి నృత్యాలు

Ex-Minister Dance: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో.. మాజీమంత్రి రఘువీరారెడ్డి జనంతో కలిసి సరదాగా నృత్యాలు చేశారు. రఘువీరా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో.. శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించారు. ఆఖరి రోజు నీలకంఠేేశ్వర ఆలయంలో ఉట్లమాను ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా డప్పు దరువులకు నృత్యాలు చేశారు.

శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు హారతులు, ఉట్లమాను ఉత్సవ కార్యక్రమాలతో ముగిశాయి. ఆలయం ముందర ఏర్పాటు చేసిన ఉట్లమాను ఉత్సవాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఉట్లమాను పైకి ఎక్కే యువకులను రఘువీరారెడ్డి ప్రోత్సహిస్తూ వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమం అనంతరం సాదాసీదా వ్యక్తిలా యువకులతో కలిసి.. రఘువీరా డప్పులకు అనుగుణంగా చిందులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ABOUT THE AUTHOR

...view details