ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురం వైకాపాలో ఆగని వర్గ విభేదాలు - వైకాపా

disputes in ysrcp leaders హిందూపురం వైకాపా నేతల మధ్య వర్గ పోరు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇరువర్గాలు పోటాపోటీగా జెండాలు ఎగురవేశారు. అయితే పక్కపక్కనే జెండాలు ఎగురవేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

disputes
disputes

By

Published : Aug 15, 2022, 10:31 PM IST

Hindupuram YSRCP leaders: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైకాపాలో వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవాన ఎమ్మెల్సీ ఇక్బాల్‌, ఆయన వ్యతిరేక వర్గాలు పక్కపక్కనే జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. హిందూపురం మండలం చౌలూరులో ఇక్బాల్‌ వ్యతిరేక వర్గానికి చెందిన హిందూపురం వైకాపా మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి అనుచరులు..గ్రామ సర్పంచ్‌, ఎంపీపీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌.. ఎంపీ గోరంట్ల మాధవ్‌తో చౌలూరుకి వెళ్లి అమరవీరుల స్థూపం పక్కనే మరో స్థూపాన్ని హడావుడిగా ఏర్పాటు చేయించి మధ్యాహ్నం జెండాను ఎగురవేశారు. ఇదేం విడ్డూరమంటూ స్థానిక వైకాపా నేతలు, గ్రామస్థుల మధ్య చర్చ సాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details