Differences in the YSRCP: వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో.. వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన సమావేశానికి ముందే నియోజకవర్గ పరిశీలకుడు పోకల అశోక్ కుమార్.. అసమ్మతి వర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవర్థన్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామిపై అసమ్మతి వర్గ నాయకులు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో కన్వీనర్ల నియామకాలు ఇష్టానుసారంగా చేపట్టారని పరిశీలకుడు పోకల అశోక్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.
మడకశిర వైఎస్సార్సీపీలో మంటలు.. ఎమ్మెల్యేపై ఫిర్యాదు - andhra pradesh news
Differences in the YSRCP: అధికార వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో.. వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన సమావేశానికి నియోజకవర్గ పరిశీలకుడు పోకల అశోక్ కుమార్ వచ్చారు. కానీ సమావేశానికి ముందే.. అసమ్మతి వర్గం ఆయనను కలిసి.. స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్సీపీలో బహిర్గతమైన వర్గ విభేదాలు